డీజిల్, పెట్రోల్ కొరత నివారించాలి. సిపిఎం మార్కాపురం జిల్లా కార్యదర్శి డి సోమయ్య.



సిపిఎం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు టి ఆవులయ్య అధ్యక్షతన జరిగింది. 

సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో గత రెండు రోజులు మించి డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడిందని దీని ద్వారా డీజిల్ పై ఆధారపడి నడుపుతున్న  ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులపై ప్రభావం, నిత్యవసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని అన్నారు. 

జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని జిల్లాలోని డీజిల్ పెట్రోల్ కొడతాను నివారించాలని అన్నారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ కొరతలేదని చెప్పుతోనే ఇవాళ జిల్లా వ్యాప్తంగా డీజిల్ ,పెట్రోల్ కొరత ఏర్పడుతుందని అన్నారు. 

ఈ సమస్య పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ తరఫున ఆందోళన చేస్తామని అన్నారు. 

సమావేశంలో సిపిఎం నాయకులు ఎస్కే అన్వర్, కే అరుణ్, బి పూర్ణచంద్రరావు, జై అల్లూరి స్వామి, డి శ్రీనివాసులు, డి రుతమ్మ, సాయి లక్ష్మి,మేరీ, కుమారి తదితరులు పాల్గొన్నారు