మండపేట :
అయినవిల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వరసిద్ధి వినాయకున్ని ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వారి మనుమడు గోవిందు తో కలసి దర్శించుకున్నారు. తొలుత ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే వేగుళ్ళ కు స్వాగతం పలికారు. అనంతరం వరసిద్ధి వినాయకునికి విశేషపూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించారు.