పలువురి కుటుంబాలకు తోట పృథ్వీ రాజ్ పరామర్శ

ఇటీవల మృతిచెందిన పలువురి కుటుంబాలను  వైఎస్సార్ సీపీ యువనాయకుడు తోట పృద్విరాజ్ శనివారం పరామర్శించారు. పట్టణానికి చెందిన వల్లూరి పుల్లాజీ చౌదరి మృతి చెందగా ఆయన అల్లుడు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి నీ పరామర్శించారు. లేగా రాజు, అర్తమూరుకి చెందిన చిర్ల చంద్రశేఖర్ రెడ్డి  కుటుంబాలను పరామర్శించారు. తమ ప్రగాఢ సంతాపం తెలియచేసారు.తోట పృధ్వీ  వెంట మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సాయి బాబా, బిసి కార్పరేషన్ మాజీ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పోతంశెట్టి ప్రసాద్,  వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, కోళ్ళ శ్రీనివాస్, ముక్తేష్ తదితరులు వున్నారు.