ఈతకోట ఘటనలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ANDRAPRADESH,BR AMDEDKAR KONASEEMA,: మంగళవారం ఈతకోటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సంఘటనలో బాధితులైన వారిని బుధవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించి ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని హాస్పిటల్ లో మరో ఇరువురు బాధితులను ఈతకోట ఆయన పరామర్శించారు.

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ జరిగిన సంఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నటులపై అభిమానులు చూపించే అభిమానమనేది సమాజంలో ఆ నటులపై గౌరవాన్ని పెంచేలా ఉండాలన్నారు. 

సేవా కార్యక్రమాలతో సమాజంలో అభిమాననటుల గౌరవాన్ని పెంచాలి తప్ప, ఇటువంటి దుశ్చర్యలతో వారిపై గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించకూడదని వ్యాఖ్యానించారు. అభిమానం  పేరుతో కొంతమంది ఆకతాయి పనులు చేస్తే ఆ సంఘటనలతో మొత్తం అభిమానులందరికీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 

ఇటువంటి సంఘటనలను ఎవరూ ప్రోత్సహించరాదన్నారు. ఘటనకు పాల్పడిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు ఏ పేరుతో విఘాతం కలిగించిన చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొందరు చేసిన ఇటువంటి చర్యలకు పవన్ కళ్యాణ్ గారిని నాయకులను ఆపాదించడం సరికాదన్నారు.