రాజమండ్రి పోలీస్ పై మందుబాబులు వీరంగం

 



 సత్యం టీవీ,రాజమహేంద్రవరం:         తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ది. 07.09.2025 వ తేదీ రాత్రి 11.40 PM గంటలకు రెండవ పట్టణ పోలీసు సిబ్బంది అయిన PC 1358 U. నాగబాబు, HG 925 కాళీ అనువారు రాత్రి గస్తీ తిరుగుతుండగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వెనుక సోనోవిజన్ షోరూమ్ దగ్గరలో ముగ్గురు వ్యక్తులు తాగి గొడవ పడుతుండగా వారిని పై నైట్ బీట్ సిబ్బంది ఆపుతుండగా ఆ ముగ్గురు వ్యక్తులు పోలీస్ యూనిఫారంలో ఉన్న నైట్ బీటీ సిబ్బందిపై దాడి చేసి గాయపరచి పారిపోయినారు. అంతట వారిపై Cr.No.200/2025 U/s 121(1), 132 r/w 3(5) BNS గా రెండవ పట్టణ పోలీసు స్టేషన్, రాజమహేంద్రవరం నందు కేసు నమోదు చేయబడినది.తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డి. నరసింహ కిశోర్ I.P.S.,  ఉత్తర్వుల మేరకు సౌత్ జోన్ DSP  S. భవ్య కిషోర్ సారధ్యంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్  TNVS శ్యాం సుందర్ వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు నమోదు చేసిన 24 గంటల లోపు సదరు కేసులో ముద్దాయిలను ది.08.09.2025 వ తేదీ రాత్రి 08.00 గంటలకు రాజమహేంద్రవరం ఈస్ట్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేయడం జరిగింది. ముద్దాయిల వివరములు.A1) కట్టుంగ హరీష్, S/o శామ్యూల్, A/26 C/యస్.సి మాల, D.NO.2-10, పాత తుంగపాడు, రాజానగరం, ఇతనికి రాజానగరం పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కలదు.  A2) కర్రి దుర్గ సూర్య ప్రసన్న కుమార్, S/o రామారావు, A/24, C/కాపు, D.No. 103/1, అభ్యుదయ కాలనీ, రాజవోలు, రాజమహేంద్రవరం రూరల్. A3). ములపర్తి వినోద్, S/o చిట్టాబ్బాయి, A/27, C/కాపు, IOCL కాలనీ, సంజీవ్ నగర్, రాజమహేంద్రవరం రూరల్.సదరు ముద్దాయిలను గౌరవ 5 వ AJFCM కోర్ట్ నందు హాజరుపరచనున్నారు. జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రాత్రి సమయములో గస్తీ ముమ్మురము చేస్తునట్లు, టైం దాటిన తర్వాత షాపులు నడుపుతున్న యజమానుల మీదా, అదేవిధముగా రాత్రి సమయములలో త్రాగి రోడ్ల మీద తిరుగుతూ, న్యూసెన్స్ చేసేవారి మీద చట్టప్రకారము చర్యలు తీసుకుంటామని డి. యస్. పి. భవ్య కిషోర్  హెచ్చరించినారు.