భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని రావులపాలెంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు

రావులపాలెం: దీన్ దయాల్ కి నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని గురువారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో నేతలు ఘన నివాళులు అర్పించారు. 

రావులపాలెంలోని బీజేపీ మహిళా మోర్చా జిల్లా మాజీ అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి నివాసం వద్ద పార్టీ మండల అధ్యక్షులు కొవ్వూరి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుఈ సందర్భంగా బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీరగోవిందరావు పలువురు నాయకులు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మతా మానవతావాదం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఆధ్యాత్మికతనే ఆలంబనగా మనిషి మనీషిగా ఎదగడమే లక్ష్యంగా ఆనాడు ఆయన దేశానికి పునాది వేశారన్నారు. 

దేశ సేవనే జీవిత పరమావధిగా కార్యకర్తల మనోహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాల్ అన్నారు ఆయన చూపిన మార్గంలోనే అంత్యోదయ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి గోనెమడతల కనకరాజు. మండల ప్రధానకార్యదర్శి మంచిగంటి కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.