మండల స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి* *వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ తమ్మన పిలుపు*


 

ఆలమూరులోని శ్రీవినాయక కన్వెషన్‌లో ఈనెల 26న నిర్వహించబోయే వైఎస్సార్‌సీసీపీ మండల స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాసు పిలుపునిచ్చారు. స్థానిక కన్వెషన్‌ హాలులో గ్రామ కమిటీ అధ్యక్షుడు రావాడ సత్తిబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 26న నిర్వహించనున్న పార్టీ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలపునిచ్చారు. ఈసందర్బంగా గ్రామ కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడంతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీ పదవులు పొందిన నాయకులను ఘనంగా సత్కరించనున్నట్లు మండల కన్వీనర్‌ తమ్మన తెలిపారు.  అలాగే ఏడాది కాలంలో అధికార కూటమి పార్టీ పాలన పరంగా విఫలమైన తీరును ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులందరూ సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మండలస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, జిల్లా పరిశీలకులు జక్కంపూడి విజయ లక్ష్మి పాల్గొంటారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు యనమదల నాగేశ్వరరావు, నామాల శ్రీనివాసు, నాండ్ర నాగమోహన్‌రెడ్డి, నాతి కుమార్‌రాజా, గుణ్ణం రాంబాబు, కోలా నాని, నాయుడు ప్రసాద్, చామకూరి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.