అగ్ని ప్రమాద భాదిత కుటుంబాలకు ఒక్కొక్కరికి......నష్టపరిహారం

 పేలుడు ఘటనలో మృతి చెందిన ఒక్కొక్కరికి 15 లక్షలు నష్టపరిహారం

- అగ్ని ప్రమాద బాధితులు నష్ట పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం....

- ఈనెల 24న కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా నష్టపరిహారం అందజేత....

- వివరాలు తెలిపిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ....

మండపేట, అక్టోబరు 21 :

రాయవరం గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్‌ లో జరిగిన అగ్ని ప్రమాద భాదిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు
నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం జరిగిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. ఆ చెక్కులను ఈ నెల 24వ తేదీన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదిగా బాధిత కుటుంబాలకు అందజేస్తారన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేసారు.