నారీ సాక్ష్యం మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు గ్రామం స్థానిక సిద్ధార్థ స్కూల్ దగ్గర శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో నారీ సాక్ష్యం మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్త్రీల హక్కులు, భద్రత, యువత మార్గద్రవ్యాల దుష్ప్రభావం, కుటుంబ విలువల పరిరక్షణ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సిఐ విద్యాసాగర్ ,సామాజిక నాయకులు, జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ పారిశ్రామికవేత్త, కోనసీమ జిల్లా కాపు సంఘం నాయకులు చల్లా ప్రభాకర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, నారి సాక్ష్యం మహిళ అసోసియేషన్ వారు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు.
అనంతరం సిఐ విద్యాసాగర్ మాట్లాడుతూ యువత మార్గద్రవ్యాల వాడకం సమాజం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని హెచ్చరించారు. విద్యార్థులు తప్పుడు స్నేహితులతో కలసి ఆ నాశనకర అలవాట్లలో పడిపోతున్నారని, తల్లిదండ్రులు వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి అవగాహన కల్పించాలని తెలిపారు. స్త్రీల భద్రత కోసం మహిళా హెల్ప్‌లైన్ నంబర్లు, సైబర్ క్రైమ్ విభాగం ద్వారా సహాయం పొందవచ్చనీ వివరించారు.కార్యక్రమంలో భాగంగా చల్ల ప్రభాకర్ రావు మాట్లాడుతూ స్త్రీ సమాజంలో కేంద్ర శక్తిగా నిలుస్తూ, దేశ అభివృద్ధికీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. స్త్రీలను బలహీనులుగా కాక, సమాన హక్కులు కలిగిన పౌరులుగా సమాజం ,భావించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. స్త్రీలపై జరిగే వివిధ రకాల వేధింపులు, అన్యాయాలపై చట్టపరమైన అవగాహన కలిగించడమే ఈ సదస్సు ఉద్దేశమని తెలిపారు. స్త్రీలు విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ముందుకెళ్లేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కే సుజాత,ఆర్గనైజింగ్ గోపిశెట్టి మానస ,చల్ల నానాజీ , చల్లా భూషణం, సుంకర సత్యనారాయణ, ఏ జి పి బూసి విద్య ప్రసన్న , బూల మహాలక్ష్మి, వరిగినీడి నితిన్ , టి నాగరాజు, సైంధల్ కుమార్, డిపిరావు ,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
