కార్యకర్తలుకు తెదేపాకు అండగా ఉంటుంది

ప్రమాద వశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తకు రూ.5లక్షల ఇన్సూరెన్స్ అందించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

ఆత్రేయపురం మండలం కట్టుంగాకు చెందిన తెదేపా కార్యకర్త వందే విజయ కుమారి ఈమధ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా,రూ.5లక్షల ఇన్సూరెన్స్ ను విజయ కుమారి భర్త రమేష్ బాబుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ ఆసరాగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు వ్యాఖ్యానించారు.