బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కొమరిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన బాణాసంచా పేలుళ్ల ఘటనలో మృతిచెందిన వెలుగుబంట్ల సత్యనారాయణ మూర్తి (మందుగుండు సత్తిబాబు ) గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయన అన్నారు. ఉదారభావంతో అయినా ఆ కుటుంబాలను ఆదుకొని సహాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ ,రాయవరం మాజీ మండల కన్వీనర్ తమలంపూడి గంగాధర్ రెడ్డి , రాయవరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు , కర్రి నాగిరెడ్డి ,ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ , మోదుకూరు గ్రామ సర్పంచ్ పెంటపాటి వెంకన్న , కొత్తపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్లి రాజు గారు పాల్గొన్నారు.