నందనవనం శివాలయం లో జ్వాల తోరణ కార్యక్రమం

ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల మెరక చామవరం శృంగవరం నడుమ నందనవనం లో వేంచేసి ఉన్న శ్రీ ఉమా వర్ధిని నాగ లింగేశ్వర స్వామి దేవస్థానం లో పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారని సాయంత్రం ఆకాశ దీపారాధన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి శర్మ , శ్రీ రాజరాజేశ్వరి పీఠం అర్చకులు రామడుగుల మంజునాథ శర్మ, ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు గ్రామ ప్రజల నడుమ  ఆలయం చుట్టూ ఊరేగించి జ్వాల తోరణ వద్ద 3 సార్లు ఊరేగించి భక్తులకు స్వామి వారి ప్రత్యేక దర్శనం తీర్థ ప్రసాదాలు అందచేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు ,ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.