ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం మండల రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ది 5-11-2025 వ తేదీన నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో మా తెలుగు తల్లికి వందనం గీతంతో ప్రారంభమై వందన సమర్పణ చేసి, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనంతో తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ ఎస్ వి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు సిహెచ్.వి.ఎస్.సతీష్ రాజు పాల్గొని గురువుల యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పాఠంశెట్టి కనికిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కొరకు మెరుగైన సౌకర్యాన్ని కల్పిస్తూ మధ్యాహ్నం భోజనం పథకం ఉచిత పాఠ్య పుస్తకాలు , ప్రయోగదీపికలు,ఉచితంగా కలగజేస్తూ ఉన్నది కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేశారు.అనంతరం కళాశాల సెక్రటరీ కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ వహించాలని తెలియజేశారు.అనంతరం పాఠశాలలో జరిగిన పరీక్షలు మార్కులు అధికంగా వచ్చిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నందుల శ్రీనివాస్ , కొవ్వూరు వెంకటరెడ్డి,గొల్ల వెంకటేశ్వర్లు, పెచ్చేటి చిన్నారావు, డిగ్రీ కాలేజ్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ నర్సారెడ్డి,టిడిపి నాయకులు పట్టాభి రామారావు,వెలగల శ్రీనివాస్ రెడ్డి, కొప్పిశెట్టి ప్రసాద్,జక్కంపూడి బాలాజీ, పడాల కొండా రెడ్డి,సాధనాల శ్రీనివాస్, కోట రమణి దుర్గ, కోట లక్ష్మణ్ ,రామిరెడ్డి గడ్డం శ్రీనివాస్ ,కళాశాల సీనియర్ అధ్యాపకులు ,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
