పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...
స్త్రీల ఆత్మ గౌరవానికి వాసవీ అమ్మవారు ప్రతీకగా నిలిచారని, వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కొత్తపేటలో ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు.ఆర్యవైశ్యులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
