గుండెపోటుంతో ఆకస్మికంగా మృతి చెందిన మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్*
*శోక సంద్రంలో మండపేట.*
*దాసిరెడ్డి వారి వీధిలో అభిమానుల సందర్శనార్థం పార్థీవ దేహం.*
ఎవ్వరూ ఊహించిన ఘోరం జరిగిపోయింది. భవిష్యత్ రాజకీయ ఆశాకిరణం, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కుడి భుజం మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నొప్పికి గురైన ఆయనను హుటాహుటిన మండపేట బిక్కిన నర్సింగ్ హోమ్ కు తరలించారు. అప్పటికే సమస్య చాలా తీవ్రంగా ఉండటంతో అక్కడ నుండి అత్యవసరంగా రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్ళేసరికే ఆయన మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన మండపేట ను ఒక్కసారిగా ఉలికిపాటు కు గురి చేసింది. కూటమి నేతలు తీరని శోక సంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు రాజీవ్ కిరీటి ఇండియా కి రావాల్సి ఉంది. మంగళవారం ఉదయానికి ఆయన చేరుకుంటారని భావిస్తున్నారు. ఈ లోపు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని దాసిరెడ్డి వారి వీధిలోని ఆయన నివాస గృహం వద్ద ఉంచారు. అర్ధరాత్రి సమయంలోనూ ఆయన అభిమానులు అధిక సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.
