బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా మేడవరపు లక్ష్మణ రావు


చింతలూరు:

_డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం శ్రీ సూర్య గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ సమావేశం చింతలూరు శ్రీసూకాంబికా బ్రాహ్మణ సేవా సంఘం భావములో నూతన కార్యవర్గం సమావేశం ఏర్పాటు ఆదివారం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా చల్లా సుబ్బయ్య, అల్లంరాజు రామకృష్ణమూర్తి, అధక్షులుగా మేడవరపు లక్ష్మణరావు (బాబి) ఉపాధక్షులుగా కూచిబొట్ల శివ, సెక్రటరీగా వేదుల లక్ష్మణ శర్మ, జాయింట్ సెక్రటరీగా మద్దూరి సుబ్రహ్మణ్య అర్చన శర్మ, ట్రెజరర్ గా చెర్ల కష్ణహనుమాన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధి 18 గ్రామాల నుంచి కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నూతన ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు._