జెడ్పీ పాఠశాల లో కాంక్రీట్ ఫ్లోరింగు ప్రారంభం బ్యాడ్మింటన్ టెన్నికైట్ కోర్టులు ఆరంభం క్రీడలతో మానసిక ఉత్సాహం

మండపేట : విద్యార్థులు చదువు తో పాటు క్రీడల్లో పాల్గొనాలని అప్పుడే మానసిక ఉల్లాసం కలుగుతుందని డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్ర మౌళి జెడ్పీ హైస్కూల్ పూర్వపు విద్యార్థి యార్లగడ్డ  శ్రీ లక్ష్మీ నీలిమ  

పేర్కొన్నారు. డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో శుక్రవారం రూ 3 లక్షల విలువతో  నిర్మించిన  కాంక్రీట్ ఫ్లోరింగును పూర్వ విద్యార్థిని  యార్లగడ్డ  శ్రీ లక్ష్మీ నీలిమ  ప్రారంభించారు . తొలుత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు  యార్లగడ్డ శ్రీ లక్ష్మీ నీలిమ ని మరొక పూర్వ విద్యార్థిని  వల్లూరి లక్ష్మి లావణ్యను ఘనంగా స్వాగతం పలికారు.  పాఠశాల కాంక్రీట్ ఫ్లోరింగ్  యార్లగడ్డ   శ్రీలక్ష్మి నీలిమ ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకటరాజు మండల విద్యాశాఖ అధికారి  నాయుడు రామచందర్రావు  సమక్షంలో ప్రారంభించారు అనంతరం కాంక్రీట్ ఫ్లోరింగ్ లో ఏర్పాటు చేసిన బాల్ బ్యాడ్మింటన్ టెన్నికైట్ కోర్టులను  పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు  కృపారావు, ఇంద్రాణి ఆధ్వర్యంలో  యార్లగడ్డ శ్రీలక్ష్మి నీలిమ వల్లూరి శ్రీలక్ష్మి లావణ్య లు ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకటరాజు మాట్లాడుతూ పాఠశాలకు మౌలిక వసతులలో భాగంగా కాంక్రీట్ ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసిన  యార్లగడ్డ శ్రీ లక్ష్మీ నీలిమ ని అభినందించారు.  పాఠశాల ఉపాధ్యాయిని సునీత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్  సత్యప్రియ, పాఠశాల ఉపాధ్యాయిని  పుణ్యమంతుల శ్రీదేవి, ఎం సుధారాణి  డి రాజేశ్వరి పాల్గొన్నారు.