మండపేట :మండపేట మండలం ఏడిద సంగమేశ్వర స్వామి వారి రథం ఉత్సవం వైభంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడిద సంగమేశ్వర స్వామి వారి రథోత్సవం లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటి చైర్మన్ గుళ్ళపల్లి ప్రసాదరావు, ఈవో శోభారాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.ఏడిద గ్రామం నుండి సంగమేశ్వర స్వామి ఆలయం వరకు రథోత్సవం సాగింది. భక్తులు విశేష సంఖ్య లో స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, గ్రామ టిడిపి అధ్యక్షులు పర్వతిని వీర్రాజు, ఏడిద సొసైటీ అధ్యక్షులు గొడవర్తి ఎర్రబ్బు, కూటమి నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మండపేట రూరల్ ఎస్ఐ కిషోర్ బాబు పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు