వాడపాలెం అయ్యప్పస్వామి, జ్ఞాన సరస్వతి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...

 


వాడపాలెం శ్రీ అయ్యప్ప స్వామి జ్ఞాన సరస్వతి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఉత్సవాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, పరివారదేవతలను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.