మండపేట : మండపేట టౌన్ పరిధిలో స్తంభాలు పై అస్తవ్యస్తంగా కేబుల్ వైరులు వేలాడదీస్తే చర్యలు తీసుకుంటామని మండపేట పుర పాలక సంఘం కమీషనర్ టీవీ రంగారావు హెచ్చరించారు. మండపేట పట్టణ కేబుల్ ఆపరేటర్లతో శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ టీవీ రంగారావు సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.పట్టణంలోని ఆపరేటర్లు విచ్చలవిడిగా విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన మిగులు ఉన్న కేబుల్ వైర్లను వారం రోజుల్లోగా తొలగించాలన్నారు. లేని పక్షంలో పురపాలక సంఘ సిబ్బంది తొలగించి దానికైన ఖర్చుని వారికి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ కేబుల్ ఆపరేటర్లకు తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్లు డి ఇ కే శ్రీనివాస్ , ఏ ఇ లు దాసరి పవన్, రెడ్డి అనూష లక్ష్మీ ,టౌన్ ప్లానింగ్ అధికారి కే రమ్య శ్రీ అధికారులు పాల్గొన్నారు.
