ఎస్‌ఐ, ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన ఇరువురికి ఘన సన్మానం
,కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందిన దొంగ సుబ్రమణ్యం స్వామి, సూర్యచంద్రరావులను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. కొత్తపేట నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేసే పోలీసుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ పేర్కొన్నారు.ఆలమూరు ఎస్ జె ఆర్ కళ్యాణ మండపంలో ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, అలాగే బదిలీపై వెళ్తున్న ఐదుగురు కానిస్టేబుళ్లను కుటుంబ సమేతంగా సన్మానించారు.ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన దొంగ స్వామి విధి నిర్వహణలో మూడుసార్లు ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్న మృత్యుంజయుడిగా అభివర్ణించారు.,వారి సేవలే వారిని కాపాడాయని పలువురు నాయకులు కొనియాడారు. కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు ప్రాంతాల్లో విధులు నిర్వహించడంతో స్వామి ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నాడని తెలిపారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజమే అయినా ఈ కార్యక్రమాన్ని సీఐ విద్యాసాగర్ చొరవతో నిర్వహించటం అభినందనీయమని కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

