అధికార ఆధిపత్య దాహం ముందుఇక ఏ శాంతి పుష్పమూ వికసించదు.ఎవరికి వాళ్లే తమ పూడ్చివేత కోసంఓ గుంట తీసుకుని ఎదురు చూడటంఇప్పుడిక తప్పనిసరిగా అలవర్చుకోవాలి.ఈ నేల ఇంత రక్తం తాగాల్సి వచ్చిందా?తెల్లని కఫనాల్లో చుట్టబడిన శరీరాలు…అవి శవాలు కావు, అవి అసంపూర్తిగా మిగిలిపోయిన కలలు.ప్రతి మృతదేహం మీద పెట్టిన ఫోటో ఒక ప్రశ్నలా చూస్తోంది “మా తప్పేమిటి?” అని..పూలతో అలంకరించిన ఈ చల్లని శరీరాలుఒకప్పుడు నవ్విన పెదవులు…పాఠశాలకు వెళ్లిన చిన్న కాళ్లు…తల్లిని పిలిచిన స్వరాలు…ఇప్పుడు?నిశ్శబ్దం మాత్రమే.ఈ దారుణం యుద్ధమా?లేదా మానవత్వం చేసిన హత్యా?బిడ్డల ఫోటోలు శవాలపై పెట్టే స్థితికిమన ప్రపంచం ఎలా చేరింది?వారి కళ్లలో ఇంకా జీవం ఉంది .కానీ వారి శరీరాలు నేలతో సమానం అయ్యాయివాళ్లు సైనికులా?వాళ్లు రాజకీయ నాయకులా?వాళ్లు ద్వేషం బోధించినవారా?లేదు.వాళ్లు కేవలం పిల్లలు.వాళ్లు కేవలం మనుషులు.ఈ దారుణాన్ని చూస్తూ కూడామనం మౌనంగా ఉంటే ..మన గుండెల్లో కొట్టుకుంటున్నది హృదయం కాదు,
ఒక రాయి.రాజకీయాల పేరుతో,మతాల పేరుతో,ప్రతీకారాల పేరుతోపిల్లల ప్రాణాలు తీసే ప్రపంచానికి ధిక్కారం!అసలు శత్రువు ఎవరో తెలుసా?మనిషి మనిషిని మనిషిగా చూడలేని ఆ అంధత్వమే.ఈ తెల్ల కఫనాలు మన జాతి మీద వేసిన నల్ల మచ్చలు.ఈ కన్నీళ్లు ఒక తల్లి గుండె పగిలిన శబ్దం.ఈ నేల గట్టిగా అరుస్తోంది,“చాలు! ఇక చాలు!”మరణించిన వారి ఆత్మలకు శాంతి కోరడం సరిపోదు.జీవించి ఉన్న మన మనసుల్లో మార్పు రావాలి.లేకపోతే…
