అయ్యప్ప స్వామి విషు దీక్ష ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన 25 మంది స్వాములు చేపట్టారు. బుధవారం ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఆలమూరు అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రధాన పూజారులు వేణుశర్మ, శింగుబాబుశర్మ చేతుల మీదుగా దూలం రవితేజ స్వామి,అడబాల అయ్యప్పస్వామి ఆధ్వర్యంలో 25 మంది మాలధారణ చేసారు.41 రోజుల అయ్యప్ప దీక్ష అనంతరం ఏప్రిల్ 15 న మలయాళ ఉగాది సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయం తెరుస్తారు. ఆ సమయంలో స్వామి వారికి ఇరుముడులు సమర్పించి దర్శనం చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ ఒకటిని అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా బడుగువానిలంక గోదావరి చెంతన ఆరాట్టు ఉత్సవం కడియం తాడాల వీర వెంకట్రావు గురు స్వామి ఆద్వర్యంలో పడాల వెంకటేశ్వర రావు గురు స్వామి పర్యవేక్షణలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఈ దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు తెలిపారు.