వాసవి మాత విగ్రహ మండపం, కళావేదిక ప్రారంభోత్సవం...

 శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ...



మండపేట :

మండపేట పట్టణం 17వ వార్డులో ఆర్యవైశ్యా కళ్యాణమండపం లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. తొలుత ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన శ్రీ వాసవి మాత విగ్రహ మండపాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం వాసవి కళావేదిక ను ప్రారంభించారు. శ్రీ కన్యాకా పరమేశ్వరి కళ్యాణమండపం నుండి కపిలేశ్వరపురం రోడ్డు మీదుగా రాజు  సుబ్బారావు  వీధి నుండి అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కాళ్ళకూరి గొల్లబాబు, అధ్యక్షులు సంకా శ్రీనివాస రంగా, ఆలయ కమిటీ చైర్మన్ బోనగిరి సుబ్బారావు,  వెంకటేశ్వస్వామి దేవస్ధానం చైర్మన్ వాకచర్ల గుప్తా, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవాని శ్రీనివాస్, కేశవరపు శ్రీను, నాళం కిట్టు, గ్రంధి సత్తిరాజు, భలబద్రపు రాజు, సంఘ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.