ప్రణాళికాబద్ధంగా రావులపాలెం అభివృద్ధికి చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ వద్ద నూతనంగా రైతు బజార్ నిర్మాణం కోసం ఆయన స్థల పరిశీలన చేశారు. స్థలాన్ని సేకరించి త్వరలోనే రైతు బజార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు.