రావులపాలెంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం పరిశీలించారు. రావులపాలెంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి అదనపు బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజ్ ను సందర్శించారు. అదనపు బస్టాండ్ నిర్మాణానికి అక్కడ స్థల పరిశీలన చేశారు. గ్యారేజ్ స్థలంలో అదనపు బస్టాండ్ నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.