'సుప‌రిపాల‌న' పూర్తి.. నెక్ట్స్ ఏంటి?


ANDRAPRADESH: ఈ క్ర‌మంలో తాజాగా ఇప్పుడు మ‌రోకార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ప్రారంభించిన `సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు` కార్య‌క్ర‌మం ఈ నెల 30తో ముగిసింది. ముందుగానే నిర్ణ‌యించుకున్న మేర‌కు 45 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నియోజ‌క‌వ‌ర్గా ల వారీగా నిర్వ‌హించాల‌ని చెప్పారు. దీని ప్ర‌కారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించారు. అయితే.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తూతూ మంత్రం అన్న‌ట్టుగా సాగినా.. మ‌రికొన్నిచోట్ల బ‌లంగానే ఈ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకువెళ్లారు. 


ఇక‌, చివ‌రిరోజు.. నెల్లూరు, చిత్తూరు, తిరుప‌తి వంటి జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని జోరుగా నిర్వ‌హించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. ఇక‌, ఇప్పుడు నెక్ట్స్ ఏంటి? ఏ కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికి 15 నెల‌ల కాలం పూర్త‌యిన నేప‌థ్యంలో వైసీపీ చేప‌ట్టిన బాబు సూప‌ర్ సిక్స్ పై కార్య‌క్ర‌మానికి పోటీగా సుప‌రిపాల‌న‌ను చేప‌ట్టారు. 

ఈ క్ర‌మంలో తాజాగా ఇప్పుడు మ‌రోకార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిలో ఈ ద‌ఫా ఎవ‌రిని ఇన్వాల్వ్ చేయ‌నున్నార‌న్నది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. కొంద‌రు స‌ల‌హాదారులు ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు.. ప‌ల్లెల్లో నిద్ర చేసే కార్య‌క్ర‌మా నికి రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది. గ్రామీణ ప్రాంతాల‌పై పెద్ద ఎత్తున ఫోక‌స్ పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ప‌ల్లె నిద్ర‌కు సంబంధించి కార్య‌క్ర‌మాన్ని రూపొందించాల‌ని నిర్ణ‌యించారు. 

సాధ్య‌మేనా? 
అయితే.. ప‌ల్లె నిద్ర‌కార్య‌క్ర‌మం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది చూడాలి. సాధార‌ణంగా ప‌ల్లె నిద్ర అంటే.. రెండు రోజుల వ‌ర‌కు అయినా ఒక ప‌ల్లెలో స‌మ‌యం కేటాయించాలి. ఇక‌, ఒక నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో క‌నీసంలో క‌నీసం.. 20 గ్రామాల‌కు త‌క్కువ‌గా కాకుండా ఉన్నాయి. ఒక్కొక్క ప‌ల్లెకు రెండే సి రోజులు చొప్పున కేటాయించినా.. 50 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. మ‌రి అంత స‌మ‌యం ఎమ్మెల్యేలు, మంత్రులు కేటాయిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా.. ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నా.. దానికి అనుగుణంగా నాయ‌కులు మాత్రం అడుగులు వేస్తారో లేదో తెలియాల్సి ఉంది.