6 గంటల్లోనే చికిత్స అందేలా చర్యలు.
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో అందరికీ ఆరోగ్యం.
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
ఆదాయంతో సంబంధం లేకుండా,రాష్ట్రంలో 1కోటి 63లక్షల కుటుంబాలకు ఆరోగ్య రక్ష ఏర్పడేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు గుత్తుల కేశవరావు అధ్యక్షతన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని ప్రసంగించారు. ప్రతీ కుటుంబానికి ఆరోగ్య భరోసా అందేలా ఈ పాలసీ ద్వారా వారికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 3,247 రకాల వైద్యసేవలు, 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో అందజేయనున్నారని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన 6 గంటలలోపే చికిత్సకు అనుమతి లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరి కుటుంబాలను అప్పుల బారిన పడకుండా ఈ భీమా కాపాడుతుందని, సీఎంఆర్ఎఫ్
ద్వారా రోగులకు ప్రభుత్వం వైద్య సాయం అందిస్తుందని తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటగా ఇటువంటి మంచి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రధాని మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.