యూరియా కొరత లేదు.. తాపేశ్వరం, ఆర్తమూరు లో రైతు అవగాహన సదస్సు.

 


 మండపేట మండలం లో యూరియా కొరత లేదని మండపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి కే ప్రభాకర్ అన్నారు. తాపేశ్వరం, ఆర్తమురు లలో సోమవారం రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  

తాపేశ్వరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో ప్రస్తుతం 9 టన్నుల యూరియా అందుబాటులో వుందన్నారు. తాపేశ్వరం, ఆర్త మురు గ్రామాలకు 145 టన్నుల యూరియా అవసరముండగా 134 టన్నులు సరఫరా చేశామన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 9 టన్నులు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వారం రోజులలో 10 టన్నులు వస్తుందని తెలిపారు.  

మండల ప్రత్యేక అధికారి పశుసంవర్ధక శాఖ ఏడిఏ ఓ రామకృష్ణ మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు.  

మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, గ్రామ నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, వీరభద్రరావు, గ్రామ శాఖ టిడిపి అధ్యక్షులు వాసంశెట్టి గోవింద్ , మాజీ ఆత్మ చైర్మన్ నూనె వీర్రాజు, తాపేశ్వరం పిఎసిఎస్ పడాల రామకృష్ణ రెడ్డి, పడాల సుబ్బారెడ్డి , వైస్ సర్పంచ్ కర్రీ సత్యనారాయణ రెడ్డి, నీటి సంఘం ఉపాధ్యక్షులు మల్లేటి సత్తిరాజు , రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.