ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బంగారయ్య పేటలో భక్తులు ఏర్పాటు చేసిన నవరాత్రి పందిరిలో ఘనంగా జరుగుతున్న దసరా వేడుకలు ఇందులో భాగంగా బంగారయ్య పేట సర్పంచ్ 5 వ రోజు లక్ష్మీ దేవి అలంకరణ సందర్భంగా తమ ఊరి ఆడపడుచులు అందరిచే ఇంటి పెద్దగా సామూహిక లక్ష్మీ కుంకుమ పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ మా సర్పంచ్ గారు మాకు అన్నయ్య తో సమానం దేవి నవరాత్రులు సమయంలో మాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో శృంగవరం శివాలయం అర్చకులు మూర్తి శర్మ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామ యువత సహాయ సహకారంతో గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు.