గన్నవరం లో అన్నా క్యాంటీన్



 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం, డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ సమీపంలో సుమారు రూ.61 లక్షల వ్యయంతో నిర్మించబడబోయే అన్న క్యాంటీన్ కు పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు  గిడ్డి సత్యనారాయణ  శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ అన్న క్యాంటీన్ ద్వారా ప్రజలకు శుభ్రమైన, రుచికరమైన భోజనం తక్కువ ధరకే అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అన్న క్యాంటీన్ అధికారులు పాల్గొన్నారు.