పోలీసుల అదుపులో మావోయిస్టు దళ కమాండర్..

కోనసీమలో మావోయిస్టు అలజడి

రావులపాలెం, నవంబర్ 19: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్టు కమాండర్ సరోజ్ మడవిని అదుపులోకి తీసుకునట్లు రావులపాలెం టౌన్ సిఐ.ఎమ్.శేఖర్ బాబు తెలిపారు. పోలీసులు తెలిపిన ప్రకారం ముందస్తు సమాచారంతో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా పిఎస్ ఏరియా బూర్గులంక చెందిన మావోయిస్టు నేత హిడ్మా అనుచరుడు సరోజ్ మడవి అలి యాస్ ఓండా స్థానిక గౌతమీ నది తీరం ఏటిగట్టు పై గల డంపింగ్ యాడ్ దాగి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ఇతను ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ దళా నికి కమ్యూనికేషన్ కమాండర్గా పనిచేస్తున్నాడు. ఇతను ప్రస్తుతం అల్లూరి సీతా రామరాజు జిల్లా ఎటపాకలో ఉంటున్నాడు. 5వతరగతి వరకూ కుంట గ్రామం లో చదివి చిన్న వయస్సులో మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడైయ్యాడు. సభ్యుడిగా కొనసాగి కమాండర్ స్థాయికి ఎదిగి మావో యిస్టు కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనే వాడు. మంగళవారం మారేడుమిల్లిలో జరిగిన పోలీసు కాల్పులు నేపథ్యంలో అగ్ర నేత హిడ్మా తో సహా కొందరు మృత్యువాత పడ్డారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడపట్టారు. బుధవారం అనుమానాస్పదంగా గౌతమీ నది ఏటుగ ట్టుపై దాక్కొన్న సరోజ్ మడవిని అదుపు లోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుండి ఒక తుపాకీ 10 తూటాలను స్వాధీనం చేసు కొని కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టు కు హాజరు పరచినట్లు సిఐ, శేఖర్ బాబు తెలి పారు.