ఈనెల 24 నుండి ఏడిద లో ఆటల పోటీలు...

 


మండపేట మండలం ఏడిద పోరస్ రైస్ మిల్లు ప్రాంగణంలో నామాల వీర్రాజు సీతారత్నం మెమోరియల్ ఆటలు పోటీలు ఈనెల 24 నుండి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు పర్వతిన వీర్రాజు, గెడ శ్రీనివాస్, ముంగర వెంకటరాజు, బొబ్బారామయ్య చౌదరి లు తెలిపారు. మండపేట నియోజకవర్గ మెగా గేమ్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త నామాల పురుషోత్తమరావు ఆధ్వర్యంలో మండపేట నియోజవర్గ స్థాయిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 6 నుండి 9వ తరగతి చదువుతున్న బాలురు బాలికలకు ఈనెల 24 నుండి 26 వరకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యఅతిథిగా మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. నామాల పురుషోత్తం ఆర్థిక సహకారంతో ఈ ఆటలు పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలురకు క్రికెట్ వాలీబాల్ కబడ్డీ కోకో చెస్ బాలికలకు వాలీబాల్ కబడ్డీ కోకో చెస్ పోటీలు నిర్వహిస్తారన్నారు. బాలురకు బాలికలకు 100 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, 600 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ డిస్కస్ త్రో, షార్ట్ పుట్ గేమ్స్ నిర్వహిస్తామని తెలిపారు. క్రీడల్లో పాల్గొనేవారు పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మండపేట నియోజవర్గం లోని ప్రజా ప్రతినిధులు మండల విద్యాశాఖ అధికారులు  ప్రధాన ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు  ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. క్రికెట్ క్రీడకు సంబంధించి ప్రతి మండలం నుండి గెలిచిన రెండు టీములు మిగతా మూడు మండలాల టీమ్ లతో పోటీ పడాలని చెప్పారు. 20 తేదీ నుండి మండల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.పోరస్ రైస్ మిల్లు  స్థలంలో ఎనిమిది టీమ్ లు మాత్రమే పోటీ పడతాయన్నారు. నామాల పురుషోత్తం ఆర్థిక సహకారంతో విన్నింగ్ టీంకు రూ 5000 నగదు బహుమతి, రన్నర్ కు 3000 నగదు బహుమతి అథ్లెటిక్ విన్నర్ కు వెయ్యి రూపాయలు రన్నర్స్ కు 500 అందజేస్తారని తెలిపారు రన్నర్స్ కు విన్నర్స్ కు వ్యక్తిగతంగా కప్పులు అందజేస్తారని తెలిపారు.