ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవస్థానం ప్రాంగణంలో ఈరోజు అనగా ది. 13-02-2026 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మహాశివరాత్రి ఏర్పాట్లపై రామచంద్రపురం డివిజన్ అధికారి శ్రీమతి D. అఖిల గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరుగినది.ఈ సమావేశంలో ఆలయ సహాయ కమిషనర్ శ్రీమతి అల్లు వెంకట దుర్గ భవాని గారు, ద్రాక్షారామ సబ్ఇన్స్పెక్టర్ గారు ద్రాక్షారామ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రికల్ ఏఈ గారు రామచంద్రపురం ఎండిఓ గారు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులకు శ్రీమతి అఖిల గారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూచుటకు తగు సూచనలు చేసి ఉన్నారు. మీడియా వారికి తెలియపరచుచున్నాము.
.jpeg)