అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
ప్రకృతిలో పాములు, కప్పలు విషపూరితంగా ఉండటం మనకు తెలుసు, కానీ న్యూగినియా అడవుల్లో కనిపించే 'హుడెడ్ పిటోహుయ్' అనే పక్షి అత్యంత ప్రమాదకరమైనది.
నారింజ, నలుపురంగుల్లో అందంగా కనిపించే ఈపక్షి ఈకలు, చర్మం,మాంసంలో 'బాట్రాకోటాక్సిన్' అనే శక్తివంతమైన విషం ఉంటుంది.
దీనిని తాకినా లేదా తిన్నా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు, తిమ్మిరి, చివరకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
