💥KL యూనివర్సిటీలో వరుస మరణాలు… 5 ఏళ్లలో 9 ఆత్మహత్యలు బయటపెట్టిన ఆర్‌టీఐ





@— భద్రత, పర్యవేక్షణపై ప్రశ్నలు

గుంటూరు జిల్లా వడ్డేశ్వరం లోని KL యూనివర్సిటీ క్యాంపస్‌లో గత ఐదేళ్లలో జరిగిన వరుస మరణాలపై కీలక వివరాలు ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్య పరిస్థితులు, క్యాంపస్ పర్యవేక్షణ వ్యవస్థలపై ఇప్పుడు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.“వార్తా ప్రపంచం” తెలుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) జాతీయ అధ్యక్షుడు డా. బండి సురేంద్రబాబు దాఖలు చేసిన ఆర్‌టీఐ దరఖాస్తుకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ స్పందిస్తూ అధికారిక సమాచారం విడుదల చేసింది.

📌 ఐదేళ్లలో 12 మరణ ఘటనలు:

పోలీసుల సమాధానం ప్రకారం 2020 నుంచి 2025 వరకు KL యూనివర్సిటీ క్యాంపస్‌లో మొత్తం:

👉 9 ఆత్మహత్యలు

👉 3 సహజేతర / ప్రమాద మరణాలు నమోదైనట్లు వెల్లడైంది.

ఆత్మహత్యల సంవత్సరాల వారీ వివరాలు

2021 – 1

2022 – 2

2023 – 3

2024 – 2

2025 – 1

సహజేతర మరణాలు2020 – ఎలక్ట్రిక్ షాక్2022 – భవనం పై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి

2023 – బస్ డ్రైవర్ అనారోగ్యంతో మరణంఈ కేసులన్నీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యాయి.

📌 ఇంకా దర్యాప్తులోనే కీలక కేసులుపోలీసుల నివేదిక ప్రకారం ఐదు కేసులు ఇప్పటికీ దర్యాప్తులో కొనసాగుతున్నాయి: 456/2023., 710/2023., 76/2024., 421/2024 , 709/2025 మిగిలిన కేసుల్లో ఫైనల్ రిపోర్టులు సమర్పించినట్లు తెలిపారు.*పోలీసుల దర్యాప్తు ప్రకారం పలు ఘటనల్లో మానసిక ఒత్తిడి, ఒంటరితనం, హోమ్‌సిక్ సమస్యలు, వ్యక్తిగత కారణాలు ప్రధానంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వరుసగా చోటుచేసుకున్న ఘటనలు క్యాంపస్‌లో కౌన్సెలింగ్ వ్యవస్థలు, విద్యార్థి సంక్షేమ చర్యలు ఎంతవరకు సమర్థంగా ఉన్నాయనే అంశంపై చర్చకు దారి తీస్తున్నాయి.

📌 డ్రగ్స్ వ్యవహారంపై పోలీసుల క్లారిటీవిద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగంపై తరచుగా వినిపించే ఆరోపణల నేపథ్యంలో కోరిన వివరాలకు పోలీసులు స్పష్టత ఇచ్చారు. 2020–2025 మధ్య కాలంలో డ్రగ్స్ / గంజాయి కేసులు — ఒక్కటీ నమోదు కాలేదు. వినియోగం లేదా సరఫరా కేసులు — Nil అని అధికారికంగా వెల్లడించారు.📌 విదేశీ విద్యార్థులపై కేసులు లేవుఈ కాలంలో విదేశీ విద్యార్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని కూడా పోలీసు శాఖ పేర్కొంది.📌 విద్యాసంస్థల్లో భద్రతపై రాజకీయ, సామాజిక చర్చ అవసరంఒక ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీలో ఐదేళ్లలో వరుసగా ఆత్మహత్యలు చోటుచేసుకోవడం విద్యా వ్యవస్థలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, క్యాంపస్ మానిటరింగ్ విధానాలపై ప్రభుత్వ స్థాయిలో సమీక్ష అవసరమా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యాసంస్థలపై నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం మరియు యూనివర్సిటీ యాజమాన్యాలు విద్యార్థుల భద్రతపై ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయా అనే అంశం ఇప్పుడు ప్రజా చర్చగా మారుతోంది.📌 పారదర్శకత కోసం ఆర్‌టీఐ — డా. సురేంద్రబాబుఈ సందర్భంగా డా. బండి సురేంద్రబాబు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో జరిగే ఘటనలపై పారదర్శక సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమని, విద్యార్థుల భద్రతపై బాధ్యతాయుత వ్యవస్థ ఉండాలని తెలిపారు.📌 ముఖ్యాంశాలు:✔️ 5 ఏళ్లలో 9 ఆత్మహత్యలు✔️ మొత్తం 12 మరణ ఘటనలు✔️ 5 కేసులు ఇంకా దర్యాప్తులో✔️ డ్రగ్స్ కేసులు నమోదు కాలేదు✔️ విదేశీ విద్యార్థులపై కేసులు లేవు

— విడుదల చేసిన వారు:డా. బండి సురేంద్రబాబుచీఫ్ ఎడిటర్, వార్తా ప్రపంచం తెలుగు దినపత్రికఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)