పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!



రాష్ట్రంలో వచ్చే నెల 2వ తేదీ తరవాత గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే ముందు, ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున.. కొన్ని నెలలపాటు ప్రత్యేక అధికారులతో పంచాయతీ పాలన కొనసాగించనున్నారు. ఈలోగా కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.