డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం,ఆలమూరు మండలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు పెన్షన్ పంపిణీ కార్యక్రమం లబ్ధిదారుల హృదయాల్లో నూతన ఆశలను నింపింది. సామాన్యులు, మహిళలు, దివ్యాంగులకు ఒకరోజు ముందుగానే పెన్షన్ అందజేయడం ద్వారా ప్రభుత్వం తమపై ఉన్న బాధ్యతను కార్యరూపంలో చూపిందని నాయకులు అభినందించారు. తెల్లవారుజామునే గ్రామాల్లో పెన్షన్ అందజేయడంతో లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈదల సత్తిబాబు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి కొనసాగుతుందని తెలిపారు.సొసైటీ అధ్యక్షులు వంటిపల్లి సతీష్, మాజీ జెడ్పీటీసీ రామానుజుల శేషయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ కేత రాంబాబు, ఐటిడిపి మండల అధ్యక్షుడు లంక వినయ్, వేమగిరి సతీష్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
.jpeg)