వైసీపీ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందని ద్రాక్షగా ఉండేది
సంక్షేమం, అభివృద్ధి రెండింటిలోనూ కూటమి ప్రభుత్వం ముందుంది
ఆలమూరులో చెక్కులు పంపిణీ చేసిన యువ నాయకులు బండారు సంజీవ్
కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని యువ నాయకులు బండారు సంజీవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందని ద్రాక్షగా ఉండేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అర్హులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందడానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాల్లో ముందు ఎన్నడూ లేనంతగా రహదారులు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలమూరు మండలానికి చెందిన మొత్తం 33 మందికి రూ.15,15,748ల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇందులో 32 రీయంబర్స్మెంట్ చెక్కులు కాగా ఒక ఎల్వోసి ఉంది.
.jpeg)