కరుటూరి నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన పాపారావు...


  పితృవియోగంతో బాధపడుతున్న నీటి సంఘం ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరటూరి నరసింహారావు కుటుంబ సభ్యులను కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు సోమవారం పరామర్శించారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెంలోని వారి స్వగృహం నందు నరసింహారావు తండ్రి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.