అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది...
గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచినఘనత తెలుగుదేశం ప్రభుత్వానికీ, చంద్రబాబు నాయుడు గారికీ దక్కుతుంది....
* ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.
* అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టింది.
* 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించింది.
* ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయి.
* అంగన్వాడీ కేంద్రాల హాజరు 70 శాతం నుంచి 96 శాతానికి పెరగడం కూటమి పాలనకు వచ్చిన ప్రత్యక్ష ఫలితం.
* ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ కలను కూటమి ప్రభుత్వం నిజం చేసింది.
* గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోనే రూ.20 కోట్లు కేటాయించింది.. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచింది.
* అంగన్వాడీ సెంటర్ కు TV, RO లు,టాయిలెట్ సౌకర్యం, టీచర్లు, ఆయాలకు వేసవిలో 15 రోజులు సెలవులు,ఆటవస్తువులు,పాఠాలు చెప్పడానికి వీలుగా చార్టులు," ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంట పాత్రలు ఇచ్చారు.
* రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తోంది.
* ఇందులో భాగంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్గా పదోన్నతి కల్పించి, పూర్తి స్థాయి వేతనాలు అందించనుంది. అలాగే కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనుంది.
* అంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించింది.
వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది....
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ,ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రతి నెల ఒకటో తేదీననే వేతనాలు చెల్లిస్తూ, ఉద్యోగులకు భరోసాగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దివాళ తీసి వెళ్ళింది. వారు చేసిన అప్పులకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది.
అంగన్వాడీలు కూటమి పార్టీలుపై నమ్మకం నుంచి ప్రభుత్వానికి అండగా నిలవాలి...
