ఒకసారి కట్టిన ఇంటిపన్ను మరలా వేరే వారి పేరున ఎలా కట్టించుకున్నారు అలాగే ఎవరో చెప్పారు అని ఎవరూ లేని సమయంలో దొంగ చాటుగా విద్యుత్ మీటర్స్ ఎందుకు తొలగించారు తొమ్మిది నెలలు కారు చీకట్లో ఒక కుటుంబాన్ని ఎందుకు ఉంచారు తీరా విషయం బయటకు వచ్చాక వేరే వారి పేరున కొత్త మీటర్ ఎందుకు ఇచ్చారు❓
ఒక వ్యవస్థలో జరిగిన చిన్న తప్పు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది ఆ తప్పు పంచాయతీ నుండే ప్రారంభం కావడం చాలా బాధాకరం 👆కేవలం లంచం తీసుకునే ఇంటి పన్నులు మార్చుతున్నారా ❓ లంచం తీసుకునే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇంట్లో లేని సమయంలో విద్యుత్ మీటర్స్ తొలగిస్తున్నారా ❓అసలు ప్రభుత్వ అధికారులు ఎవరి కోసం పని చేస్తున్నారు ❓ ప్రజల కోసమా లేక పైసలు కోసమా ❓ అనే అనుమానం కలుగుతుంది 🤔ఇక ర్యాలీ గ్రామానికి చెందిన గంగన్న గారి కుటుంబం ఈ రోజున రోడ్డున పడడానికి ముఖ్యంగా నమ్మక ద్రోహం అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది 👆ఈ రోజుల్లో తీసుకున్న అప్పు కూడా తనఖా కాకుండా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ❓
ఒక స్థలం అమ్మలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ సమయంలో అందరి సంతకాలు తీసుకుంటారు కానీ అప్పు తీసుకునే సమయంలో సేల్ డీడ్ చేయించుకుని మిగతా కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండా అది నాదే అనే స్థాయికి వెళుతున్నారు అంటే అసలు ఈ విషయంలో చట్టాన్ని అధికారులు చేతుల్లోకి ఎలా తీసుకుంటున్నారు ❓
ఇప్పుడు గతంలో తొలగించిన మీటర్ వేయకుండా సుమారు తొమ్మిది నెలలు చీకట్లో ఉంచే అధికారం అసలు ఆత్రేయపురం విద్యుత్ అధికారి వారికి ఎవరి ఇచ్చారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ❓
తప్పు చేసి కూడా ఆ చేసిన తప్పుని సరిదిద్దు కోవాలి అనే ఆలోచన లేకపోవడం ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది 🤔ఇక ఈ విషయంలో మా నేను సైతం టీం ప్రభుత్వ ఉన్నత అధికారులను పూర్తి స్థాయిలో ధర్యాప్తు చేసి భాధత కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటూ 🙏🙏
